సీ నా శ్రీమతి

అంశం --- నా శ్రీమతి

సీ l l
శ్రీమతి నా ప్రియతమ మహా బహుమతి
బహుమతి భాగ్యంబు బాసి పోయె
వెలిగండ్ల వారింట వెలిగిన అరుణమే
పుట్టి నింటికి దెచ్చె పుడమి కీర్తి
పలక రింపున మల్లె పరిమళం వెదజల్లి
అయిన వారల కెల్ల ఆప్త మయ్యె
ఇంటి భాద్యత మీద యిల్లాలు గాతాను
కష్టంబు ననకుండ కలిసి పోయె

తే.గీ.
గృహము లోనున్న దేవత గుడిని వోలె
నిలచి యుండెను తేజమై నిక్క ముగను
అట్టి దీపంబు యింటిలో ఆరిపోయి
చీకటిల్లున మేమంత చిక్కి నాము l l

వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి