వచనం నారీ నవతరం ఇప్పుడు

నారీ నవతరం ఇప్పుడు

గడచిన సంవత్సరాల క్రితం ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి అబ్బాయిలకి అంత డిమాండ్ అప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది అమ్మాయిల టైం వచ్చేసింది దానికి ఎందుకు గగ్గోలు పెట్టి గోల గోల చేస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ ఇప్పుడు అమ్మాయిల సీజన్ వ్యాపారస్తుల పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు అది ఖచ్చితంగా బాధపడవలసిన విషయమే కానీ గతంలో మాకు అబ్బాయి ఉండాడు ఎన్ని లక్షలు ఇస్తారు కట్నం గురించి వివరాలు తెలుసుకొని సంబంధం చూసేవారు అప్పుడు అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రుల ఇష్టారాజ్యంగా నడిచింది ఇప్పుడు అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు నడుస్తుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది ప్రతి ఒక్కరు గమనించండి దయచేసి కావున అబ్బాయి కానీ
అబ్బాయిల తల్లిదండ్రులు కానీ కాలం తీరును బట్టి సర్దుకొని పోయి నట్లు అయితేనే పెళ్లిళ్లు
కాగలవు లేకుంటే ఈ జన్మలో పెళ్లి అయ్యే అవకాశాలు ఉండవు ఎందుకనగా ఇప్పటికే
దాదాపు అబ్బాయిలకు 30 సంవత్సరములు
రానిదే ఎవ్వరికీ పెళ్లిళ్లు కుదరడం లేదు ఇంకో
10 సంవత్సరములు కొనసాగితే పెళ్లికి మంగళం
పాడినట్లే అనుకోండి మా కాలంలో పద్దెనిమిది
ఇరవై కే పెళ్లిళ్ళు కుదిరేవి నాకు ఇరవైకే కుదిరింది
48 వచ్చే సరికి నాకు మనవడు కూడా పుట్టాడు
కావున నవవర యువకులారా తల్లిదండ్రులారా
మారండి మారండి మీరు గతాన్ని మరిచి పొండి
ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నడుచు కోండి

ఓం సర్వేజనా సుఖినోభవేత్

Y. naaga

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం