సీ పద్యం

సీ l l
మంచి గుణము చేత మరినీచ జాతైన
మహనీయుడై నిల్చు మహిని యందు
కృషిజేయ నెవడైన ఋషిగాక పోడిందు
కనుక యత్నించరో కష్ట మనక
దీనుడ ననుకోక దివ్య జీవనమందు
మనసు నిలుపు చుండు మరచి పోక
ఉన్నత కులమైన సన్నని జాతైన
యత్నంబు జేయక యదగ డెవడు

తే l l
పట్టుదల యుంటే నెవడైన పైన జేరు
సోమరెప్పుడు యున్నతి సోక లేడు
కాన రాజైన రౌ తైన రణము నందు
వీర లక్షణం బట్టియే విజయ ముండు l l

రచన
వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం