భగవద్ గానం

భగవద్ గానం

నమ్మి జూడరా నారాయణుని
వేడుకొనుమురా వెంకటేశుని
కొలిచి చూడరా కోసల రాముని
శరణు వేడరా శేష శయణుని l l

పూలకు రంగులు వేసిన దేవరు
పక్షుల కడుపులు నింపిన దెవరు
వనముల కెవ్వరు నీరు పోసిరీ
నినుగాపాడుట తనకొక లెక్కా l l

కడుపున శిశువును పెంచిన దెవరు
తిన్న అన్నమును రుబ్బిన దెవరు
నిదురలోన నిను గాచిన దెవరు
నీ కూపిరి ఊది పోసిన దేవరు l l

రచన
వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం