పాట పురుషోత్తమా

పురుషోత్తమా నీ పూజ జేసిన వారి
పుణ్యమింతని లెక్క చెప్ప తరమౌన l l

గణిత నిపుణ కైన గణముల పతికైనా
ధర్మాధర్మాలపతి యమ ధర్మునికైనా
నొదుటజన్మ రాతలు రాసే బ్రహ్మకైనా చెప్ప తరమౌన చెప్ప తరమౌన l l

విద్యాధిపతి కైనా నధిక విద్వాసి కైనా
సకలశాస్త్రములు జెప్ప చదువరులైనా
వ్యాకరణ మొచ్చినా పండితు లైనా
చెప్ప తరమౌన చెప్ప తరమౌన l l

నారదాది మునులకైనా ఏ నరులకైనా
సకల శాస్త్ర శారదుడైన సాధువైనా
చుక్కలెంచు వారలైనా చూడనిదీ చెప్పినా
చెప్ప తరమౌన చెప్ప తరమౌన l l

రచన
నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం