పాట భేదం భేదం

భేదం భేదం సమాజ బేధం
భేదం భేదం కులమత బేధం l l

పారే నీటికి భేదంలేదు
పచ్చని చెట్లకు భేదంలేదు
వీచే గాలికి భేదంలేదు
వీటికి లేనిదె మన కెందుకురా l l

పుడమి తల్లికీ భేదంలేదు
పూచే పూలకు భేదంలేదు
సూర్య చంద్రులకు భేదంలేదు
చూచే వాడికి మనకెందుకురా l l

పసిపిల్లలకు భేదంలేదు
పర్వతాలకు భేదంలేదు
మండే మంటకు భేదంలేదు
మధ్యన నున్నా మనకెందుకురా l l

రచన --యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి  9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం