పాట తిన్నావా

తిన్నావా లేదా అని అడిగావా ఎపుడైనా?
నడుము వాల్చలేదేమని అన్నావా ఎపుడైనా?
చీరనీకు బాగుందని పొగిడావే కానీ
చీరకు నీవే సొగసని అన్నావా ఎపుడైనా?
వంట చేసితే బాగుగ తిన్నావే గానీ
నీ చేతి వంట కమ్మనని అన్నావాఎపుడైనా?
జడలో మల్లెల వాసన పీల్చావే గానీ
నామనసులో పరిమలంబు చూశావాఎపుడైనా?
బండ చాకిరీ చేసితె చూశావే గానీ
నా గృహదేవత నీవేనని అన్నావాఎపుడైనా?

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం