పాట పలుకురులోన

పల్లవి

పలుకూరు లోన ప్రజల మేలును గోరు
బ్రహ్మ నందా చార్యుడును వెలసే l l

రత్నమ్మ రామచంద్రయ్య
దంపతులకు పుట్టినా
సద్భావ సుగుణ సంపదుడు
బ్రహ్మా నందా చార్యుడు

కాలుష్యమును జూచి
కలత నెంతయో జెంది
మొక్కలను నాటింప
మొదలు బెట్టిన ఘనుడు l l

చెడు వ్యసనముల జిక్కి
చెడి పోవువారిని
మద్య పానము మాన్ప
మరి ప్రజ్ఞ జెయించే

పరుల సేవయే గొప్ప
పర తత్వమని ఎంచి
ప్రజల సేవల యందు
పరితపించుచు నుండే l l

పాలకులు మెచ్చంగా
పనులు లెన్నో చేపట్టి
ధార్మికంబున బ్రతుకు
బరుగు చున్నాడిలన

వీర వంశపు ఘనత
సూర్య వంశము వోలె
జీవించె నిలలోన
బ్రహ్మా నందా చార్యుడు l l

రచన వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం