పాట నీనామమేమాకు

నీనామమే మాకు నిత్య కైవల్యము
నీగాణమే ఎపుడు నిర్మలానందము ll

కరిరాజు బ్రోచినా కమల పత్రాక్ష
దశకంఠు దునిమినా దశరథ రామ
శిశుపాల శిరచ్చెద శ్రీ రుక్మిణీ నాథ
ఇట్లు దలచమాకు ఇహపరంబులు తండ్రీll

కౌసల్య సుత నీకు కానుక లేమివ్వను
సవ్యసాచి సఖుడనే సాగిల బడి మ్రొక్కెద
దేవకి వసుదేవ సుతా దైవమాని వెడదప్ప
ధనరాసు లివ్వగలనా దశరథ సుత రామ l l

భవరోగమును బాప భజనలు మాకు
దివ్యమైన ఔషధము దినము తినెదము
యమ భటుల దరుమ మాకు ఎల్లవేలలా
దివ్య మహా ఆయుధం  దీనబాంధవ దేవll

రచన.
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం