పాట

శంకర శివ శంకరా
భవహర నిను విడువరా
హర హర సోమేశ్వరా
నాగధర ననుగావరా l l

శ్రీకర శ్రిత భక్తవరా
శరణుర శశిశేఖరా
దిగంబర నా మొరవినరా
శశీధర నను బ్రోవరా l l

కావర కరుణాకరా
భక్త వర  గతి దేవరా
భష్మధర నీ భక్తుడరా
నాటకర నన్నాడకురా l l

దయాకర దరి జేర్చురా
శూలధర సుగుణాకర
సకలవర సగుణాకరా
ధీనుడర  నన్నిడవకురా l l

రచన వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం