పాట
ఏమయ్యా శంకరయ్యా
నీ ఆటా విచిత్రం బయ్య
ఆ...ఆటలో మనుషులను
గారడి చేస్తున్నావయ్యా l l
మనసేమో మంచికి రాదు
తనువేమో భోగము విడదు
చిత్తము శ్రీరంగని జూడదు
నాలుక నారాయణ యనదు l l
ధనముంటే గుణముండదు లే
గుణముంటే ధనముండదు లే
చెడు తనముకు మంచి విరోధం
మంచికి సంరక్షణ కరువు l l
పాప పనులు మనసుకు తీపీ
పుణ్య మంటే పుట్టదు బుద్ధి
ధర్మ మంటే దారికి రాదు
దయనుజూప రాతి గుండె l l
రచన వై.నాగరంగయ్య
నీ ఆటా విచిత్రం బయ్య
ఆ...ఆటలో మనుషులను
గారడి చేస్తున్నావయ్యా l l
మనసేమో మంచికి రాదు
తనువేమో భోగము విడదు
చిత్తము శ్రీరంగని జూడదు
నాలుక నారాయణ యనదు l l
ధనముంటే గుణముండదు లే
గుణముంటే ధనముండదు లే
చెడు తనముకు మంచి విరోధం
మంచికి సంరక్షణ కరువు l l
పాప పనులు మనసుకు తీపీ
పుణ్య మంటే పుట్టదు బుద్ధి
ధర్మ మంటే దారికి రాదు
దయనుజూప రాతి గుండె l l
రచన వై.నాగరంగయ్య
Comments
Post a Comment