పాట సంసారాం

అంశం
సంసార నిస్సారం
పాట

సంసారం సంసారం
చాలు చాలు సారం
సంసారం జేసినే
సంకనాకి బోతినయ్య ll

సంసార మందు మునిగి
సద్గురుని మరచి బోతి
ఆలు సుతుల సుఖ మంటూ
ఆత్మను చింతించ నైతి ll

పెళ్లామే బెల్ల మనుచు
కన్న వారి నిడనాడితి
నాయకులే పోషకులని
నమ్మి మోస బోయితిని ll

మగువ తీపి కోసమై
మంగళ సూత్రము గడితి
మాయ జేసి నన్నది
మడుగులోన ముంచేశా ll

రచన
వై.నాగరంగయ్య
తాడిపత్రి

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి