పాట కృష్ణ గానం

అంశం ----కృష్ణ మాయ గానం

ఏమయ్యా కృష్ణయ్యా నీ
మాయా విచిత్రంబయ్య
ఆ మాయా యీ మనుషులకు
నంటా గట్టితి వేమయ్యా l l

పేదోడికి ఆకలి పెక్కు
తినడానికి తిండీ లేదు
ఉన్నోడికి రోగా లిచ్చి
తినకుండా జేసితివీ l l

బలమిచ్చి గర్వమునూ
అంటా గట్టితి వేమయ్యా
ఆస్తులు ఐశ్వర్య మిచ్చి
అహమును ముడి వేసితివే l l

పని చేయని సోమరికీ
అతి తెలివిని ఇచ్చావు
కష్టపడుచు ఉన్న వానికి
కడుపుకే చాలన్నావు l l

రచన వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం