వడ్డెరన్నా పాట
అంశం.
గృహనిర్మాణ శ్రామికుడు
వడ్డేరన్నా నువ్వు లేకుంటే
లోకానికి ఇల్లెక్కడిదన్నా l l
నీ చమట చుక్కలతో
ఇటుకమీద ఇటుకబెట్టి
ఇల్లు మీద ఇల్లు గట్టి
నిలువ నీడ నిచ్చావన్నా l
కర్రలపై నిలబడతవు
కాలుజార దనుకొంటవు
సడలని ధైర్యము తోన
సాహసమే జేస్తవన్నా l l
గుండెను రాయిగ జేసి
తాపి చేత బట్టినావు
చేతులు బోరకలు బడినా
పనులుచేయ మానవన్నా l
చాలీ చాలని కాసులు
సంసారం గడప లేక
భార్యా పిల్లల తోన
బడుగు బాట నీదన్నా l l
అందమైన డిజైన్ వేసి
అలంకారములు దిద్ది
అవణిలోన ఇల్లు కట్టి
సృష్టి బ్రహ్మవైనావన్నా l l
రచన
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి
గృహనిర్మాణ శ్రామికుడు
వడ్డేరన్నా నువ్వు లేకుంటే
లోకానికి ఇల్లెక్కడిదన్నా l l
నీ చమట చుక్కలతో
ఇటుకమీద ఇటుకబెట్టి
ఇల్లు మీద ఇల్లు గట్టి
నిలువ నీడ నిచ్చావన్నా l
కర్రలపై నిలబడతవు
కాలుజార దనుకొంటవు
సడలని ధైర్యము తోన
సాహసమే జేస్తవన్నా l l
గుండెను రాయిగ జేసి
తాపి చేత బట్టినావు
చేతులు బోరకలు బడినా
పనులుచేయ మానవన్నా l
చాలీ చాలని కాసులు
సంసారం గడప లేక
భార్యా పిల్లల తోన
బడుగు బాట నీదన్నా l l
అందమైన డిజైన్ వేసి
అలంకారములు దిద్ది
అవణిలోన ఇల్లు కట్టి
సృష్టి బ్రహ్మవైనావన్నా l l
రచన
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి
Comments
Post a Comment