వచనం bc కుల వృత్తులు

సమాజములో bc కులవృత్తుల నాటి
ప్రాధాన్యత నేటి దుర్భర స్థితి.
నాడు నేతగాళ్ళు మగ్గము నేయనిదే
జనులకు కట్టు బట్టలు లేవు
నేడు ఆధునిక ఫవర్ మగ్గములొచ్చి
జవులీ పరిశ్రమ పెచ్చు పెరిగి
నేతలకుపాది లేకుండా పోయి
బ్రతుకు దుర్భర బాటలో నడుచు చున్నది
నాడు కుమ్మరి చక్రం తిప్పనిదే
నీటి కడవలు వంటకు కుండలు లేవు
నేడు ఆధునికమొచ్చి నీరుకు ప్లాస్టిక్
బిందెలు వంటకు కుక్కర్లొచ్చి కుమ్మరి
ఉపాధి ఊరు పొలిమేరలు దాటి పోయె.
నాడు కంసాలి కమ్మలు ముక్కు పుడకా
భారణాలు చేయనిదే ముత్తైదువులకు
శోభ లేదు నేడు ఆధునిక మిషిన్ వర్క్
రెడీమెడ్ ఆ భరణము లొచ్చి కంసాలికి
కాసులు లేకుండా పోయే.
రజకుడు, రాజుకైనా రౌతు కైనా
ఏ జనులకైనా చాకలి మాసిన
బట్టలుతకనిదే మారు బట్టలుండవు
నేడు వాషింగ్ మిషన్లు వచ్చి రజక
ఉపాదులు లేకుండా పోయాయి.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం