బీదవాని భక్తి సీ l l
అంశం
ఒక నిరుపేద తన భక్తిని భగవంతునకు
ఇలా విన్న వించు కొనుచున్నాడు .
సీ ll
కూర్చుండ మాఇంట కుర్చీలు లేవు నా
ప్రణయాంకమే సిద్ద పరచ నుంటి
పాధ్యమ్ము నిడమాకు పన్నీరు లేదు నా
కన్నీళ్ళతో కాల్లు కడగ నుంటి
పూజకై మావిట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పించ నుంటి
నైవేధ్య మిడమాకు నారికేళము లేదు
హృదయమే చేతికందీయ నుంటి
తే.గీ.
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము దయచేయ మాత్మ ఫీఠమ్ము పైకి
అమృత ఝరిపించు నీ పదాంఖముల యందు
కోటి స్వర్గాలు మొలిపించు కొనుచు తండ్రి ll
ఇది కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం
సేకరణ&టైప్
వై.నాగరంగయ్య
తాడిపత్రి
ఒక నిరుపేద తన భక్తిని భగవంతునకు
ఇలా విన్న వించు కొనుచున్నాడు .
సీ ll
కూర్చుండ మాఇంట కుర్చీలు లేవు నా
ప్రణయాంకమే సిద్ద పరచ నుంటి
పాధ్యమ్ము నిడమాకు పన్నీరు లేదు నా
కన్నీళ్ళతో కాల్లు కడగ నుంటి
పూజకై మావిట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పించ నుంటి
నైవేధ్య మిడమాకు నారికేళము లేదు
హృదయమే చేతికందీయ నుంటి
తే.గీ.
లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము దయచేయ మాత్మ ఫీఠమ్ము పైకి
అమృత ఝరిపించు నీ పదాంఖముల యందు
కోటి స్వర్గాలు మొలిపించు కొనుచు తండ్రి ll
ఇది కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం
సేకరణ&టైప్
వై.నాగరంగయ్య
తాడిపత్రి
Comments
Post a Comment