కృష్ణుడే కృష్ణుడే కృపగల కీలవేల్పుడు

కృష్ణుడే  కృష్ణుడే కృపగల వేల్పుడు
సకల జనులకు తానే మోక్ష గతుడు l l

తాపస మునులకు తత్వమయా మయుడు
యతులకు గతుడు వేద విజ్ఞానుడు
ఎవరికి తోచని వెదకిన దొరకని
లీలా మానుష మాయా రూపుడు l l

గోపికా మనోహరుడు గోవింద దేవుడు
చిన చిన్న చేష్టలా చిద్విలా నందుడు
శిశుపాల కంసుల సింహ స్వప్నము వాడు
భాగవతోత్తములకు భగవంతుడు l l

తలచెడి వారిని తరచు తరచున గాచు
నమ్మి కొలిచిన వారి నారాయణుండు
శరనన్న వారికి అభయ ప్రధాతుడు
భక్తిగల్గిన వారి భవ భయ హరుడు l l

రచన
నాగరంగయ్య

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం