గీతా అంతా నేనె సీ పద్యం
💐అంశం --శ్రీకృష్ణ భగవాన్ గీతా సందేశం💐
సీ ll
ఎల్లలోకములను యేలువాడను నేనె
ప్రజలందరికి కూడ ప్రభువు నేనె
పుడమిన ప్రాణుల పుట్టించుటయు నేనె
సకల జీవులకు సంరక్ష నేనె
సంసారమున కీడ్చు సకలమాయయు నేనె
కర్మలు కల్పించు కర్త నేనె
దుష్టుల దునుమాడి శిష్టుల గాపాడి
ధర్మము స్థాపించు దైవ నేనె
ఆ.వె.
మ్రొక్కు వారి కెల్ల మోక్ష గతిని నేనె
సర్వ కాలములకు సాక్షి నేనె
అలవి కాదు చెప్ప నంతటున్నది నేనె
ముజ్జగంబులకును ముక్తి నేనె l l
రచన
వై.నాగరంగయ్య. 9866068240
సీ ll
ఎల్లలోకములను యేలువాడను నేనె
ప్రజలందరికి కూడ ప్రభువు నేనె
పుడమిన ప్రాణుల పుట్టించుటయు నేనె
సకల జీవులకు సంరక్ష నేనె
సంసారమున కీడ్చు సకలమాయయు నేనె
కర్మలు కల్పించు కర్త నేనె
దుష్టుల దునుమాడి శిష్టుల గాపాడి
ధర్మము స్థాపించు దైవ నేనె
ఆ.వె.
మ్రొక్కు వారి కెల్ల మోక్ష గతిని నేనె
సర్వ కాలములకు సాక్షి నేనె
అలవి కాదు చెప్ప నంతటున్నది నేనె
ముజ్జగంబులకును ముక్తి నేనె l l
రచన
వై.నాగరంగయ్య. 9866068240
Comments
Post a Comment