భారత జాతీయ జెండా పాట
శీర్షిక. భారత జాతీయ జెండా విశిష్టత గేయం
భరతభూమి విజయ జెండా....
పింగళి వెంకయ్య చేత
రూపు దిద్దుకొన్న జెండా ||
మూడు రంగులతోన
ముచ్చటగా నున్న జెండా
నడుమధ్య చక్రమున
నవ్యలోలుకు జెండా ||
భారత దేశానికది
చిహ్నమైన జెండా
భావితరాలకు ఎంతో
భరోసా నిచ్చు జెండా ||
స్వాతంత్ర సమరులకు
ధైర్యము సమకూర్చు జెండా
దేశ భక్తులకు తాను
దేవతగా యున్న జెండా ||
యువత గుండెలోన
రక్తం ఉడికించు జెండా
పగవారి పాలనను
పరుగులు పెట్టించు జెండా ||
రచన&గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment