పాట

అంశం

ధీనుని యొక్క భగవదావేదన
దిక్కు లేరురా దినకర తేజా
ధీనుని బ్రోవగ దిగిరావేరా
ఈ ధీనుని బ్రోవగ దిగిరావేరా ll

కరిని గాపాడ వచ్చితివే
మకరిని వధించి బోయుతివే
ద్రౌపది వేడగ వచ్చితివే
దండిగ కోకల నిచ్చితివే ll

ప్రహ్లదుని రక్షించితివే
పాండు సుతుల పాలించితివే
గోవర్ధన గిరి నెత్తితివే
గోవులన్నిటిని గాచితివే ll

వానర స్నేహము జేసితివే
వారధి సులువుగ దాటితివే
రావణాసురుల జంపితివే
రాజ్యము తమ్ముని కిస్థివె ll

రచన
వై.నాగరంగయ్య
తాడిపత్రి

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి