ఆ.వె ఛందస్సు 2

*అవగాహనకొరకు గణ,యతి, ప్రాసలు*

ఆటవెలది పద్యలక్షణాలు:
""""""""""""""""""""""""""""""""""""

1. పద్యానికి నాలుగుపాదాలుంటాయి
2. ఒకటి, మూడు పాదాలలో 3 సూర్యగణములు, 2 ఇంద్రగణములు ఉంటాయి
3. రెండు, నాలుగు పాదాలలో ఐదు సూర్య గణాలే ఉంటాయి.
4. మొదటిగణము మొదటి అక్షరానికి నాల్గవగణం మొదటి అక్షరానికి యతిమైత్రి
5. యతి చెల్లనిచో ప్రాసయతి వాడవచ్చు (అంటే మొదటిగణం రెండవ అక్షరానికి నాల్గవగణం రెండవఅక్షరానికి)
6. ప్రాసనియమంలేదు.


ప్రాసయతి అనగా
    యతి కుదరనపుడు ప్రాస స్థానములోని అక్షరానికి,(అనగా పాదంలోని రెండవ అక్షరానికి)
యతిమైత్రి తర్వాత అక్షరానికి(4వ గణం రెండో అక్షరానికి) ప్రాస వేయాలి.
ప్రాసలో హల్లుకు ప్రాధాన్యత ఉంటుంది

     *!!గణములు!!*
సూర్య గణాలు రెండు

III-నగణము
UI-హగణము లేదా గలము

ఇంద్ర గణాలు ఆరు

నలము       IIII
నగము        IIIU
సలము       IIUI
భగణము    UII
రగణము     UIU
తగణము    UUI

యతి:పద్యపాదములో మొదటి అక్షరాన్ని యతి అంటారు
ఇందులో అచ్చుకు ప్రాధాన్యత ఉంటుంది

యతిమైత్రి కలిగిన అక్షరాలు....
1) అ-ఆ-ఐ-ఔ.య. హ.న.
2) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ.
3) ఉ-ఊ-ఒ-ఓ.

గమనిక:
హల్లుతో పాటు దాని మీది అచ్చుకు  కూడా యతిమైత్రి పాటించాలి.

ఉదా:
i)క-కా-కై-కౌ;
ii)కి-కీ-కృ-కౄ-కె-కే;
iii)కు-కూ-కొ-కో.

4)క-ఖ-గ-ఘ
5) చ-ఛ-జ-ఝ-శ-ష-స
6) ట-ఠ-డ-ఢ
7) త-థ-ద-ధ
8) ప-ఫ-బ-భ-వ
9) అనుస్వారం(సున్న)తో కూడిన వర్గాక్షారాలు నాలుగు ఆ వర్గపు పంచమాక్షరం (అనునాసికాక్షరం)తో యతి చెల్లుతాయి.
 
జ్ఞ ం క,ంఖ,ంగ,ంఘ-ఙ;
ఇ ంచ,ంఛ,ంజ,ంఝ-ఞ;
ణ ంట,ంఠ,ండ,ంఢ-ణ;
న ంత,ంథ,ంద,ంధ-న;
మ ంప,ంఫ,ంబ,ంభ-మ.
10) పు,ఫు,బు,భు-ము.
11) ర-ఱ-ల-ళ.
12) న-ణ.
13) అచ్చులతో య,హ లకు యతి చెల్లుతుంది. అంటే
(i) అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ;
(ii) ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యె,యే, హి,హీ,హృ,హె,హే;
(iii) ఉ,ఊ,ఒ,ఓ, యు,యూ,యొ,యో, హు,హూ,హొ,హో.

14) ‘క్ష’ అనేది కకార, షకారాల సంయుక్తాక్షరం కనుక దానికి క,ఖ,గ,ఘలతోను, చ,ఛ,జ,ఝ,శ,ష,సలతోను యతి చెల్లుతుంది.
15) యతిమైత్రి లేని అక్షరాలు రెండింటికి ఋత్వం ఉన్నట్లయితే వాటికి యతి చెల్లుతుంది. ఉదా. కృ-తృ. 

సర్వేజనా సుఖినోభవంతు 

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం