పాంచాలి సభలోన

అంశం
భక్తి (భగవద్ భక్తి)

సీ ll
పాంచాలి సభలోన పరువు గా పాడిన
పతిత పావన దేవ పాహి పాహి
సవ్యసాచికి గొప్ప సందేశ మిచ్చినా
పక్షివాహన దేవ పాహి పాహి
గోవర్ధనము నెత్తి గోవులన్  గాచిన
పశుపాల బాలకా పాహి పాహి
రణ రంగమున గొప్ప రావణున్ జంపినా
భక్త సన్నుత దేవ పాహి పాహి

తే.గీ.
పద్మ నాభుడ పలుమార్లు పలికి పలికి
దాటు కొందును యీజన్మ ధన్యముగను
అవని జనులను గాపాడ యవతరించ
ఏడు కొండల వోస్వామి యెంకటేశ ll

సాహిత్యం &  గానం
వై.నాగరంగయ్య.
ఇంటి నంబర్ 3/48 రెడ్డివారి పాళ్యం తాడిపత్రి.515411 అనంతపురం జిల్లా ap

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం