ఏఆంధ్ర భాష చే

* తెలుగు భాష యొక్క గొప్పదనం

సీ ll
ఏయాంధ్ర భాషచే యనలేని కీర్తితో
         తిక్కనా నన్నయ్య తిరిగి రిలన
ఏయాంధ్ర భాషచే యన్నియో పద్యముల్
         వేమన్న నీతులు వెలసె మున్ను
ఏయాంధ్ర భాషచే యిలపైన పోతన్న
          పరమమ భాగవతంబు పదిల పరచె
ఏయాంధ్ర భాషచే యెంకటేసుని మీద
         ఆలపించెను పాట లన్నమయ్య

తే.గీ.
నిట్టి ఘనకీర్తి గలిగున్న నీతి భాష
ఆంధ్ర భోజున కిదియంతో ఆశ భాష
ఈష్టు దేశాలకిది మహా యింద్ర భాష
ఘనత గర్వంగ జాటరా ఘన ఘనానిll

సాహిత్యం & గానం
వై. నాగరంగయ్య తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం