ఆట చాలించరా

శీర్షిక
ప్రపంచ నాటకం పరమేశ్వర ఆట
-------------------------------------------
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి

గేయం

ఆట చాలించరా  ఆట చాలించరా
చావుపుట్టుక లాట చాలించు రా శివ ll

తల్లిపాలు తాగించావు తప్పటడుగు లేయించావు
నవయవ్వన నాటకము నారిమీద నడిపావు

ఆత్మకు తెర అడ్డుగా ఆలి నంటగట్టి నావు
సంసార మను బోను సక్కగా బెట్టినావు ll

బ్రతుకు దేరువు నీటిలోన ఆశల వల వేసినావు
మమ కారములతో మమ్మూ మట్టు బెట్టినావు ll

తిండి తిప్పలను బెట్టి తిప్పితివి రాట్నంబు
తికమకలతోన మాకు తిరుణాల జూపించావు ll

సంపద సుఖభోగాలు అంతకంత పెంచి పెంచి
చావుతోన నన్నటిని సాగరమున ముంచి నావు ll

రచన.
యలిగండ్ల.నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం