శ్రీరామ జయరామ

శీర్షిక
శ్రీరామచంద్ర మూర్తి స్తుతి

రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

శ్రీరామ జయరామ సీతారామ
రామ రఘురామా రామ సీతారామ l l

దశరథా సుతునిగా బుట్టినావు
దశకంఠములు ఖండించినావు
శరణాగతుల కభయమిచ్చినావు
శంభు పూజలు ఇలన జేసినావు l l

బండరాతిని తాకి బ్రతికించి నావయ్యా
శివధనస్సును ఎక్కు పెట్టి నావయ్యా
మాములు దేవుడవు కావయ్యా
ముక్కోటి దేవతల కధిపతివయ్యా l l

ధర్మమును కాపాడ ధరణి ఏకైకవు
ధనస్సుపట్టిన ఎదురు లేనియోధుడవు
నీ దివ్య చరితంబు విన్న మోక్షంబు
నీ నామ స్మరణంబు నిత్య కైవల్యము l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం