కుప్పించి ఎగచిన
సీ l l
కుప్పించి యెగచిన కుండలంబుల కాంతి
గగన భాగంబెల్ల గప్పి గొనగ
నురికిన నోర్వక నుదరంబు లోనున్న
జగముల వ్రేగునా జగతి గదల
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరలి దిరిగ
తే l l
గరికి లంగించి సింహంబు కరణి మెరిసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జునా యనుచు మద్విశిఖ వృష్ఠి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు l l
Comments
Post a Comment