నడిపొద్దు నామీద
నడిపొద్దు నామీద
ఏపొద్దు పడకుండ
శ్రీరామ చంద్రుండు
నీడల్లే తానుండ
దిగులుండ నాకేల నంటా
మనసార పిలువంగ
మదిలోన కొలువుండ
నాకేమి భయముండు నంటా
చలియైన వానైన
నామీద పడకుండ
చీమైన దోమైన
కీ డెపుడు చేకుండ
కౌసల్య సుతుడుండ
కాపాడ తోడుండ
వేడంగ నే నుండ
నాకేమి భయముండు నంటా
యముడైన ఎవడైన
నామీద చేయి వేస్తే
కోదండ బాణంబు
కోపంబు చేబూని
మట్టు బెట్టక మానదండోయ్
కనురెప్పలా నన్ను
కాపాడ తానుండ
నాకేమి భయముండు నంటా.
రచన&గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
ఏపొద్దు పడకుండ
శ్రీరామ చంద్రుండు
నీడల్లే తానుండ
దిగులుండ నాకేల నంటా
మనసార పిలువంగ
మదిలోన కొలువుండ
నాకేమి భయముండు నంటా
చలియైన వానైన
నామీద పడకుండ
చీమైన దోమైన
కీ డెపుడు చేకుండ
కౌసల్య సుతుడుండ
కాపాడ తోడుండ
వేడంగ నే నుండ
నాకేమి భయముండు నంటా
యముడైన ఎవడైన
నామీద చేయి వేస్తే
కోదండ బాణంబు
కోపంబు చేబూని
మట్టు బెట్టక మానదండోయ్
కనురెప్పలా నన్ను
కాపాడ తానుండ
నాకేమి భయముండు నంటా.
రచన&గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment