వెతకండయా మీరు వెతకండయ
శీర్షిక
తెలుగింటి అమ్మాయి తప్పిపోయింది"
గేయం
రచన డాక్టర్ బెజంకి జగన్నాధాచార్యులు. మాచర్ల.
గానం:ఎలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి.
వెతకండయా మీరు వెతకండయా
తెలుగింట అమ్మాయి కానరాకున్నది ll వె ll
తలను నున్నగ దువ్వి రెండు జడలేసింది
జడలకు జడగంట లున్నాయయా
లేడికన్నుల వంటి కన్నులకు కాటుక
నుదుట కుంకుమబొట్టు పెట్టిందయా ll వె ll
ముక్కున ముక్కర చెవులకు జూకాలు
చెంప సవరాలు నొసటపాపటిబిళ్ళ పెట్టిందయా
దొండ పండు ల్లాంటి పెదవులు నవ్వంగ
ముత్యాల పలు వరస మెరిసే నయా ll వె ll
పట్టులంగాకట్టి బుట్ట జాకెటుతోన
ఘళ్ళు ఘళ్ళున కాలి గజ్జెలూ గాజులు
మోగు చుండగ అల్ల నల్లన అడుగులతొ
కలహంస గమన మా తెలుగింటి పిల్ల ll వె ll
కాళ్ళకు పసుపు చేతులకు గోరెంటా
జడలోన మల్లెలు చామంతిబిళ్ళ పెట్టిందయా
జక్కనా చెక్కిన శిల్పమోయనుచు
చూడ చక్కగనుండు మాతెలుగు బిడ్డ ll వె ll
దొరికిన వారికి దొడ్డ బహుమతి కలదు
అందరూ బహుమతిని అందుకోండయ్యా
వెతకండయా మీరు వెతకండయా
తెలుగింట అమ్మాయి కానరాకున్నాది l l
తెలుగింటి అమ్మాయి తప్పిపోయింది"
గేయం
రచన డాక్టర్ బెజంకి జగన్నాధాచార్యులు. మాచర్ల.
గానం:ఎలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి.
వెతకండయా మీరు వెతకండయా
తెలుగింట అమ్మాయి కానరాకున్నది ll వె ll
తలను నున్నగ దువ్వి రెండు జడలేసింది
జడలకు జడగంట లున్నాయయా
లేడికన్నుల వంటి కన్నులకు కాటుక
నుదుట కుంకుమబొట్టు పెట్టిందయా ll వె ll
ముక్కున ముక్కర చెవులకు జూకాలు
చెంప సవరాలు నొసటపాపటిబిళ్ళ పెట్టిందయా
దొండ పండు ల్లాంటి పెదవులు నవ్వంగ
ముత్యాల పలు వరస మెరిసే నయా ll వె ll
పట్టులంగాకట్టి బుట్ట జాకెటుతోన
ఘళ్ళు ఘళ్ళున కాలి గజ్జెలూ గాజులు
మోగు చుండగ అల్ల నల్లన అడుగులతొ
కలహంస గమన మా తెలుగింటి పిల్ల ll వె ll
కాళ్ళకు పసుపు చేతులకు గోరెంటా
జడలోన మల్లెలు చామంతిబిళ్ళ పెట్టిందయా
జక్కనా చెక్కిన శిల్పమోయనుచు
చూడ చక్కగనుండు మాతెలుగు బిడ్డ ll వె ll
దొరికిన వారికి దొడ్డ బహుమతి కలదు
అందరూ బహుమతిని అందుకోండయ్యా
వెతకండయా మీరు వెతకండయా
తెలుగింట అమ్మాయి కానరాకున్నాది l l
Comments
Post a Comment