దేహమిచ్చి నోడివీ నీవే

దేహమిచ్చి నోడివీ నీవే
           బలమిచ్చినోడివీ నీవే
నూపిరి ఊది నోడివీ నీవే
         అన్నిటిని దీసేయు వాడ నీవే ll

ఆలు సుతులనెల్ల నంటగట్టు వాడ నీవే
సంసార సమరంబు సమకూర్చు వాడనీవే
నాప్రాణంబు నట్టేట ముంచు వాడవు నీవే
నాతండ్రి నాతండ్రి నారాయణా మూర్తి ll

ఆయుస్సు కాలంబు నీయు వాడవు నీవే
సకల సంపద భోగ సమకూర్చు వాడ నీవే
కడుపు మాడగజేయ కఠినాత్ముడవు నీవే
నాతండ్రి నాతండ్రి నారాయణా మూర్తి ll

ఆశా పాశాములను పెట్టి నోడివీ నీవే
కర్మ కాండములను కట్టి నోడివి నీవే
మమతాను రాగాలు మలిచి నోడివీ నీవే
నాతండ్రి నాతండ్రి నారాయణా మూర్తి ll

సాహిత్యం & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి.9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం