పోయేదానిమీద పోతున్నాడయ్యా బుద్ది

శీర్షిక
మనసు నీమీద నుంచ లేకున్నాను
స్వామి శ్రీవేంకటేశా
-----------------------------------------------
గేయం

పోయే దానిమీద పోతున్నదయ్య బుద్ది
నిత్యమున్న దానిమీద నిమిషముండదయ్యబుద్ది
దానితీరు దిప్పంగ దమ్మునాకు లేదయ
ఏడుకొండల సామి వేంకటేశ వేంకటేశ ll

మహరాజు లైనగాని మనసునిలుప లేరయ్య
నీమీద భక్తుంటే నిలుపంగ సులువయ్య
నీమాయ దాటంగ నిటలాక్షు కెరుకయ్య
ఏడుకొండల సామి వేంకటేశ వేంకటేశ l l

నావారు నావారు నాది నాది యనుబుద్ది
ఆశలన్ని అంతరించు దానిమీద బోతుంది
అత్మైక భావంబు అసలు బట్ట నంటుంది
ఏడుకొండల సామి వేంకటేశ వేంకటేశ l l

సాహిత్యం & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం