శిల్ప వైభవం
అంశం---శిల్ప వైభవం.
సీ ll
సుత్తి దెబ్బల చేత సుందరంబుగ రాయి
అవనిలో దేవతై యవత రించె
సత్బ్రాహ్మణుల తోడ సజ్జనాదుల చేత
నిత్యపూజలు గొంచు నిలచె యవని
భూషురోత్తములకు భువనంబునకుతాను
పూజ నీయత నొందె పుడమి నందు
వేద మంత్రాలచే వెయిదివ్య కాంతితో
వెలుగు చుండుచు తాను వెలసె యిలను
తేll
మహిని సాకార దేవతై మాని తముగ
మానవాలికి మహిలోన మహిమ గున్న
మాటి మాటికి జూచుచు మనసు నిల్పి
వసుధ జనులెల్ల జేతురే వందనంబు ll
రచన--y. nagarangaiah.9866068240
సీ ll
సుత్తి దెబ్బల చేత సుందరంబుగ రాయి
అవనిలో దేవతై యవత రించె
సత్బ్రాహ్మణుల తోడ సజ్జనాదుల చేత
నిత్యపూజలు గొంచు నిలచె యవని
భూషురోత్తములకు భువనంబునకుతాను
పూజ నీయత నొందె పుడమి నందు
వేద మంత్రాలచే వెయిదివ్య కాంతితో
వెలుగు చుండుచు తాను వెలసె యిలను
తేll
మహిని సాకార దేవతై మాని తముగ
మానవాలికి మహిలోన మహిమ గున్న
మాటి మాటికి జూచుచు మనసు నిల్పి
వసుధ జనులెల్ల జేతురే వందనంబు ll
రచన--y. nagarangaiah.9866068240
Comments
Post a Comment