భగవద్భక్తుల కథలు

శివుడు లేనిచోటెక్కడ...🔱

అవ్వయ్యార్ అనే వృద్ధురాలు పరమశివుని భక్తురాలు. 

ఆమె భక్తికి మెచ్చి గణపతి ఆమెను సశరీరంగా కైలాసానికి తీసుకెళతాడు. 

అవ్వ కడు వృద్ధురాలవడం వల్ల కాళ్లు మడచి కూర్చోలేక  శంకరుడికి ముందు కాళ్లుచాపి కూర్చొంది. 

అది చూసి పరమేశ్వరుని పక్కనే ఉన్న పార్వతీదేవికికేమో మనస్సు చివుక్కుమంది. అలా కూర్చోవడం అపరాధం కదా అనే భావంతో అవ్వకు ఒకసారి చెప్పి చూడమని పతిని కోరింది.

"'అమ్మో! ఆమె పరమభక్తురాలు.  ఆమెనేమి అనకూడదు!' 

అని శివుడు సూచించాడు. అయినా అమ్మవారు
తన భర్త మీద ఇలా అమర్యాదను సహించలేక చెలికత్తెకు చెప్పి చూసింది.

 ఆ చెలికత్తె వెళ్లి అవ్వను సమీపించి 'అవ్వా! కాళ్లు ఈశ్వరుని వైపునకు పెట్టకు' అంది. 

అప్పుడు ఆ వృద్ధురాలు అలాగా అమ్మా! ఈశ్వరుడు లేని చోటెక్కడోచెప్పు. కాళ్లు అటువైపు పెట్టుకుంటాను' అంటూ ఒక పక్కకు తిప్పుకుందట!. పరమేశ్వరుని లింగం ఆ వైపునకు తిరిగినది ఇలా
అటు తిప్పితే అటూ తిరిగాడు. ఇటు తిప్పితే ఇటు శంకరుడు తిరగాల్సివచ్చింది. 

అలా తిరుగుతూ పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు చూసి 'నేను చెబితే విన్నావు కాదు! ఆమె నన్ను ఎలా తిప్పుతున్నదో చూడు. అందుకే నేను నోరు మెదపకు అన్నాను. నేను భక్తుల వశమేననినీకు తెలుసు కదా!' అన్నాడు... 

అప్పుడు పార్వతీదేవి స్వయానా అవ్వదగ్గరికి పోయి 'అవ్వా! నన్ను క్షమించు' నేనే పొరపాటు చేశాను నీ అచంచలమైన భక్తిని గుర్తించ లేక ఇలా చేశాను అని ప్రార్థించింది.ఆ అవ్వను.
-----------------------------------------------------------------

        పూసలార్ అనే శివ భక్తుడు 

పూసలార్ అనే శివ భక్తుడు తమిళ నాడులో
తిరునిడ్రా పూర్ లో  ఉండేవాడు  ఎంతో పేదరికంలో ఉండేవాడు. కానీ ఈయన శివునికి ఒక అద్భుతమైన గుడి కట్టాలని కోరుకునేవాడు.

ఈక్రమంలో భాగంగా ఇతరులకు తన అభిప్రాయాన్ని చెప్పి వారిని అడిగే ప్రయత్నం కూడా  చేయ లేదు ఎందు కంటే పేదవాడు 
చందాలకు పోయిన యెడల వీడు ఆధనముతో
వాడికి  తినడానికి వస్తున్నాడేమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉందురు అని ఆలోచించాడు ఏమో
పాపం తెలియదు

అంతలోనే ఒక మహోన్నత ఆలోచన మనసుకు తగిలింది అది ఎలాంటిది అంటే ప్రతిరోజూ తన మనసులో పునాదులు తీసి అక్కడి నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు అందులో వేసి ఆ పైన ఒక్కొక్క ఇటుక పేరుస్తూ, శివాలయం నిర్మాణం ప్రారంభించాడు
అది రోజు రోజుకు నిర్మాణం పెరుగుతూ వస్తూ దానికి ప్రాకారాలు ఉపాలయాలు గర్భ గుడి మంటపం ధ్వజస్తంభం ఇలా అన్నీ పూర్తి అయ్యాయి  విగ్రహ ప్రతిష్టకు డేట్ ఫిక్స్ చేసినాడు ఫలానా రోజు అని. ఇది ఒక అంతర్ముఖమైన మానసిక చర్యలోనే ఈ తతంగం అంతా జరిగి పోయింది. 

అంతలోనే 
ఆ ప్రదేశంలోని శివభక్తు డైన  ప్రాంతీయ పల్లవ  రాజు  కూడా కాంచీపురంలో ఉన్న ఒక పెద్ద శివాలయం కట్టాలని సంకల్పించి శివాలయం పూర్తి చేసి స్వామి ప్రతిష్టకు పూసలర్ నాయనర్ నిర్ణ యించు కొన్న డేట్ కే రాజు కూడ నిర్ణయించు కోవడంలో వల్ల ఇద్దరివి ఒకేరోజు కావడంతో 
శివుడు రెండు చోట్లకు ఒకే సమయంలో వెళ్ళుటకు
వీలు పడదని ఆలోచించి; ఒక రోజు ముందే శివుడు రాజు కలలో కనబడి, “నేను రేపు నీ ఆలయానికి రాలేను. ఎందుకంటే పూసలార్ కూడా ఒక ఆలయం కట్టుకున్నాడు తన ఊరైన తిరు నిండ్రా పూర్ లో ప్రాంతంలో. నేను ఆ ఆలయానికి వెళ్ళాలి. అతను కూడా రేపే దానిని ఆవిష్కరిస్తున్నాడు” అని చెప్పాడు.

రాజు ఉలిక్కి పడి భయంతో లేచాడు.
నేను ఆలయ నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలుగానో ఎంతో కష్టపడ్డాడు. ఎంతో డబ్బు వెచ్చించాను ఎంతో శ్రమ పడ్డాను. కానీ, శివుడు ఇప్పుడు మరో ఆలయానికి వెళ్తానని చెప్తున్నాడు., ఆ ఆలయం పూసలార్ కట్టిందని చెప్తున్నాడు. ఎవరీ పూసలార్..? నాకు తెలియని ఈ ఆలయం ఏమిటి..? అని పల్లవ రాజు ఆశ్చర్యపోయాడు. పూసలార్ ఎవరో కనుక్కురమ్మని రాజు తన సైన్యాన్ని పంపించారు. తిరు నిండ్రాపూర్కు 
రాజ భటులు అక్కడ ఒక  గుడిసలో నిరు పెదగా ఉన్న పూసలార్ ని చూశారు. “నీ ఆలయం ఏది ?” అని పూసలార్ ని బెదిరించారు భటులు
వెంటనే పుసలార్ గారు. నేను కట్టుకున్న ఆలయం నా హృదయంలోనే” ఉంది ఎక్కడ లేదు అని సమాధానం చెప్పాడు. వచ్చిన రాజభటులు
వెనుదిరిగి పోయి రాజుగారికి జరిగిన విషయం
తెలుపుతారు రాజుగారు ఆశ్చర్య చకితుడై 
పూసలార్ ఇంటికి స్వయానా వచ్చి
పూసలార్ గారిగి నమస్కరించి అయ్యా మీ 
మానసిక భక్తి చేత  శివునికి ఆలయం నిర్మించి
అందులో శివలింగ ప్రతిష్ఠ కు స్వయానా శివుడే
వచ్చి అక్కడ కూర్చుంటున్నాడు అంటే నీభక్తి
ప్రపత్తులు ఎంత గణనీయ మైనవి అందునా నా రాజ్యంలో మీరు నివసించడం మాభాగ్యం అని వేనోళ్ళ కొనియాడి నాడు రాజుగారు పూసలార్ 
గారిని.
------------------------------------------------------------

మూర్తి నాయనారు చరిత్ర 

మూర్తి నాయనారు పాండ్య దేశపు రాజధాని అయిన మధురై నగరంలో వైశ్య కులంలో జన్మించారు. ఆయనకు మధురైలో వెలసిన సుందరేశ్వర స్వామి (సోమసుందరేశ్వరుడు) అంటే అమితమైన భక్తి.

మూర్తి నాయనారు స్వామివారికి ప్రతిరోజూ సుగంధ పరిమళాలు వెదజల్లే చందనం (గంధం) సమర్పించడాన్ని ఒక నియమంగా, వ్రతంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆయన రోజూ స్వయంగా చందనం చెక్కలను సానరాయిపై అరగదీసి, గంధాన్ని సిద్ధం చేసి ఆలయానికి సమర్పించేవారు.అలా చేయనిదే ఆయన ముద్ద ముట్టడు.

ఈ క్రమంలో అతడి జీవితం నడుస్తుండగా అనుకోకుండా 
ఒకసారి కర్ణాటక ప్రాంతానికి చెందిన మరొక రాజు మూర్తి నాయనారున్న పాండ్య దేశంపై దండెత్తి మధురైని ఆక్రమించాడు. ఆ కొత్త రాజు జైన మతాన్ని అనుసరించేవాడు  శైవ మతం పట్ల ద్వేషం కలిగినవాడు. శైవాన్ని పూర్తిగా తుడిచేయాలీ అని సంకల్పించి శివ భక్తులను భయపెట్టి హింసించేవాడు.అందరూ జైనం స్వీకరించాలి అని రాజు అజ్ఞగా
ఆదేశించాడు దేశంలో మూర్తి నాయనారు చేస్తున్న నిత్య గంధం సేవ గురించి తెలుసుకున్న ఆ రాజు, ఆయనను ఎన్నో రకాలుగా హింసలకు గురి చేశాడు, ఎంతకు లొంగక పోవడంతో ఆయనకు ఎక్కడా చందనం చెక్కలు దొరకకుండా నిషేధం విధించాడు.

ఇట్టి పరిస్థితులలో మూర్తి నాయనారుకు ఎంత ప్రయత్నించినా చందనం చెక్క దొరకలేదు. "ఈ రోజు స్వామికి గంధం సమర్పించలేనా?" అని ఆయన తీవ్రమైన ఆవేదన చెందారు. ఓ దయా సాగర ఈ రాజ్యాన్ని ఒక క్రూరుడు పాలిస్తూ ఉన్నాడు,నీ భక్తులను బతక నివ్వడం లేదు , మాకు శివ భక్తుడైన రాజును ఎప్పుడు ప్రసాదిస్తావూ,ఈరోజు నీకు గంధం ఎలా సమర్పించింది అని స్వామిని ఎంతో బాధతో మనసులో వేడుకున్నాడు .వెంటనే ఆయనకు ఒక ఆలోచన స్ఫురణకు వచ్చింది ఓహో చందనం చెక్క లేకపోతేనేం? సాన రాయి ఎలాగో ఉంది కదా,నా దేహమే నీకు ఈరోజు చందనం!" అని భావించి, గంధం తీసే కఠినమైన సానరాయిపై తన మోచేతిని పెట్టి బలంగా రుద్దడం మొదలుపెట్టారు. చర్మం చీలి, రక్తం ధారలుగా కారుతున్నా లెక్కచేయకుండా, ఎముకలు అరిగేలా రుద్దుతూనే ఉన్నారు.

అప్పుడు మూర్తి నాయనారు సాహసానికి, భక్తికి చలించిపోయిన పరమశివుడు అశరీరవాణిగా ఇలా పలికాడు:
"ఓ భక్తాగ్రేసరా! సాహసించకు. నీ అచంచలమైన భక్తి నామనసు కరిగిపోయింది . నిన్ను హింసించిన ఆ రాజు త్వరలోనే మరణిస్తాడు. ఆ తర్వాత నువ్వే ఈ దేశానికి రాజువైతావు అప్పుడు నీవు లోకంలో  ధర్మాన్ని నిలబెట్టి , శివభక్తులు మళ్ళీ వృద్ధి చెందింప చేసి చివరకు నా లోకానికి (శివలోకం) చేరుకుంటావు."అన్నాడు
వెంటనే ఆశ్చర్యంగా మూర్తి నాయనారు గాయాలు మానిపోయి, ఆయన శరీరం దివ్య తేజస్సుతో ప్రకాశించింది.

6. రాజ్యాధికారం

శివుడు చెప్పినట్టే, కొద్ది రోజులకే ఆ క్రూరమైన రాజు వారసులు లేకుండా మరణించాడు. ఉదాహరణకు తమిళనాడు CM జయలలిత లాగా అప్పటి ఆచారం ప్రకారం, తదుపరి రాజును ఎన్నుకోవడానికి మంత్రులు "రాజ పట్టపు ఏనుగు" తొండానికి పూలమాల ఉంచి, కళ్లకు గంతలు కట్టి నగరంలోకి వదిలారు. ఆ ఏనుగు నేరుగా ఆలయం దగ్గర ఉన్న మూర్తి నాయనారు దగ్గరకు వెళ్లి, ఆయన మెడలో పూలమాల వేసి, తన వీపుపై ఎక్కించుకుంది.

తదుపరి
మూర్తి నాయనారు రాజు కావడానికి అంగీకరించారు ప్రజలుకూడ  కానీ, ఒక షరతు పెట్టారు. నాయనారు 
"నాకు రత్నాలతో కూడిన కిరీటం వద్దు, జడలు కట్టిన నా జుట్టే కిరీటం. పట్టు వస్త్రాలు వద్దు, విభూతి, రుద్రాక్షలే నా రాజ ఆభరణాలు."అని ప్రకటించి.

ఆయన విభూతి ధరించి, రుద్రాక్షలు వేసుకుని రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పాలించారు. ఆయన పాలనలో శైవ మతం మళ్ళీ వైభవాన్ని సంతరించుకుంది. చివరగా ఆయన శివసాయుజ్యాన్ని (మోక్షం) పొందారు.

నీతి: భగవంతుని కోసం సర్వస్వం (చివరికి తన శరీరాన్ని కూడా) అర్పించగలిగే నిష్కల్మషమైన భక్తికి మూర్తి నాయనారు ప్రతీక.
--------------------------------------------------

కుబేరుని ఐశ్వర్య గర్వ భంగం

ఐశ్వర్యానికి కారకుడు కుబేరుడని అంటారు కానీ వాస్తవంగా ఈ చరాచర సృష్టిలో ప్రతి దానికి కారకుడు, అధిపతి సాక్షాత్ ఆ బోలా శంకరులే...ఐశ్వర్యానికి కారకుడు శివుడే ..........!!

ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు.

శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి
బాగా పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసంకు చేరుకుంటాడు.

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు.

కుబేరుడు వచ్చి.. మహాదేవా.. మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు.

శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ అమ్మవారు ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు.

వస్తూనే... 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి.

పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి..
'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగానే , శివుడు కూడా 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.

హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది.అని కాస్త వెటకారంగా
మనసులో భావిస్తూ
గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు.

ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు.. గణపతికి వడ్డించారు.

కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు.

సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు.

ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తూండగానే ఖాళీ అయిపోయింది.

విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు కడుపునిండా ఆహారం పెట్టకుండా ఏమిటి ఇలా
చేస్తున్నావు కడుపునిండా భోజనం పెట్ట లేనోడివి
ఎందుకు పిలుచుకొచ్చావు అంటూ కాస్త గాట్టిగా మాట్లాడినాడు.

కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా.. శంకరా.. నేవే దిక్కు.. ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు.

అప్పుడు శివుడు "కుబేరా! నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని అహకారం విడిచి, చేసిన తప్పుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు.
ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం.

కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా....
-----------------------------------------------------
నాస్తికుడు కథ

ఒక నాస్తికుడు ఒక సందేహం వచ్చి ఒక సాధువు గారిని అడిగాడు స్వామి నాకొక సందేహం ఉంద
అది తీర్చండి అన్నాడు.ఆ సాధువు సరే చెప్పు నాయనా అన్నాడు 

మనోడు అందుకున్నాడు వెంటనే స్వామి దేవుడు
కళ్ళు రెండు చెవులు రెండు ముక్కులు రెండు రంధ్రాలు కాళ్ళూ చేతులు ఇలా అన్నీ రెండేసే ఉన్నాయి కానీ నోరు మాత్రం ఒకటే పెట్టినాడు 
అదేమీ స్వామి అన్నాడు నాస్తికుడు.

అందుకు బదులుగా సాధువు గారు ఇలా అన్నాడు
నాయనా ఒక్క నోరు పెట్టింటేనే తెగ వాగేస్తున్నారు
ఈ మనుషులు నోరు మూత పడకుండా ఎప్పుడూ
ఏదో ఒకటి వాగుడే వాగుడు ఇక తిండి అంటావా
ఇంట్లో అనిలా  బైట ఆనిలాఎన్ని సార్లు ఎన్ని రకాలో ఎక్కడ బడితే అక్కడ బండ్ల మీద బజారులో ఏ ఫుడ్ వదలరు ఇలా ఉంది 
ఇక నీవు చెప్పినట్లు రెండు నోళ్ళు ఉంటే 
ఏమై పోవునో సమాజం కావున నాయనా
మితభాషి మితాహారి అన్నారు పెద్దలు మితంగా
తినండి మితంగా మాట్లాడండి అని దేవుడు
ఒక్క నోరు మాత్రమే ఇచ్చాడు.

ఇక మిగతావి  అన్నీ కూడా డబుల్ డబుల్ రెండేసి ఉన్నాయి కదా వాటి వివరాలు చెప్పు తావిను 

ఒక రైతు తాను వ్యవసాయం చేసే భూమి ఎక్కడో
ఉంటుంది అక్కడికి రోజు పోవాలి కదా భూమి
సాగుకోసం ఒక్క కాలుతో ఎలా నడవగలడు భూమి ఎలా దున్న గలడు కాబట్టి రెండు కాళ్ళు ఉండాలి.
ఇక రెండు చేతులు అంటావా భూమి 
దున్నుతున్నపుడు ఒక యెడమ చేత్తో నాగలి భూమిలోకి నొక్కాలి
మరో కుడి చేత్తో కర్రతో ఎద్దులను పురమాయించాలి ఇవన్నీ లెక్క లోకి తీసుకొని
రెండు కాళ్ళు రెండు చేతులు అవసరం అనే ఇచ్చాడు నాయనా మనిషికి దేవుడు.

ఇక చెవులు అంటావా విద్యార్థి దశలో స్కూల్లో పాఠాలు బాగా వినాలి గురువుల వద్ద వారు చెప్పే
ఉపదేశాలు పురాణ ఇతిహాసాలు ఇవన్నీ శ్రద్ధగా వినాలి ఎందు కంటే గురువులు మళ్ళీ మళ్ళీ చెప్పరు అప్పుడు నేను వినలేదు అన్నా ఒప్పుకోరు  కాబట్టి రెండేసి ఉన్నాయి 

కళ్ళు కూడా అంతే ఏదైనా పుస్తకంలో చిన్న చిన్న
అక్షరాలు చదవాలన్నా లేక
సూక్ష్మ మైనవి సూది మొనలాంటివి చూడాలన్న
రెండు కళ్ళు బాగా పని చేస్తేనే కదా చూడగలడు 
ఒక వయసు వచ్చాకా రెండు కళ్ళు ఉన్నా అవి
పనిచేయక ఇబ్బంది పడుచున్నారు చూస్తున్నాం
కదా.
ఇక ముక్కులు కూడా ఇంతే రెండు రంద్రములతో
శ్వాస పీల్చు కొంటూ వదులుతూ ఉంటేనే ఊపిరి తిప్పుకో గలము లేకుంటే బ్రతకడం కష్టం ఇంత
చెప్ప నేల నాయనా రెండు ఉన్న ఏ దానిలో నైనా ఒక దానిని ప్రక్కన బెట్టి ఉన్న ఒక్కదానితోనే ఆయా సంభందిత పనులు చేసి చూడు నీకే అర్థ మౌతుంది
ఉదాహరణకు ఒక ముక్కు రంధ్రం కాసేపు మూసి
చూడు విషయం అర్థమైపోతుంది 
అన్నాడు సాధువు గారు ఇవన్నీ విన్న నాస్తికుడు.
సాధువు గారికి నమస్కారం బెట్టి వెళ్లి పోయాడు.

--------------------------------------------------------------

తిరునీలనాక్క నాయనార్

శైవ భక్తి సామ్రాజ్యంలో అపురూపమైన భక్తికి, ఆత్మ సమర్పణకు నిలువెత్తు నిదర్శనం 26వ నాయనారు అయిన 'తిరునీలనాక్క నాయనారు'. ఆచారాల కంటే నిష్కల్మషమైన ప్రేమే భగవంతుడికి చేరువ చేస్తుందని ఆయన జీవిత చరిత్ర మనకు తెలియజేస్తుంది.

🌸 **జననం - శివ పూజా తత్పరత**
చోళ సామ్రాజ్యంలోని 'సత్తమంగై' (సాత్తమంగై) అనే అగ్రహారంలో, వేదశాస్త్రాలను ఔపోసన పట్టిన బ్రాహ్మణ కుటుంబంలో తిరునీలనాక్క నాయనారు జన్మించారు. ఆయన పరమ శివభక్తుడు. ప్రతిరోజూ స్థానికంగా ఉన్న 'అయవందీశ్వర స్వామి' (శివుడు) ఆలయానికి వెళ్లి, ఆగమ శాస్త్రాల ప్రకారం ఎంతో నిష్టతో, భక్తిశ్రద్ధలతో పూజలు చేసేవారు. అంతేకాకుండా తమ ఇంటికి వచ్చే శివభక్తులను సాక్షాత్తు పరమశివునిగా భావించి, వారికి ఆతిథ్యం ఇచ్చి సేవ చేయడం ఆయన దినచర్య.

🕸️ **శివలింగంపై సాలెపురుగు**
ఒకరోజు ఆర్ద్ర నక్షత్రం పర్వదినం సందర్భంగా, ఆయన తన భార్యతో కలిసి అయవందీశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ఆయన వేద మంత్రాలు పఠిస్తూ స్వామివారికి పూజలు చేస్తుండగా, పైకప్పు నుండి ఒక సాలెపురుగు నేరుగా శివలింగం మీద పడింది.

అది చూసిన ఆయన భార్య తల్లడిల్లిపోయింది. పసిబిడ్డ మీద ఏదైనా కీటకం పడితే తల్లి ఎంత ఆందోళనతో దానిని నోటితో ఊది పారేస్తుందో, అలాగే ఆమె కూడా శివలింగం మీద పడిన ఆ సాలెపురుగును గట్టిగా గాలి ఊది పారేసింది. కానీ ఆచారాలను కచ్చితంగా పాటించే తిరునీలనాక్క నాయనారుకు ఇది మహాపరాధంగా అనిపించింది. నోట్లోని ఎంగిలి గాలి శివలింగానికి తగలడం మహాపాపమని భావించి, భార్యపై తీవ్రంగా ఆగ్రహించారు. ఆమెను క్షమించలేక, గుడిలోనే వదిలేసి ఆయన ఒంటరిగా ఇంటికి వెళ్లిపోయారు.

🌙 **కలలో శివుని దర్శనం - కనువిప్పు**
ఆ రాత్రి తిరునీలనాక్క నాయనారు నిద్రిస్తుండగా సాక్షాత్తు పరమశివుడు ఆయన కలలో కనిపించాడు. స్వామివారి శరీరమంతా సాలెపురుగు విషం వల్ల పెద్ద పెద్ద పొక్కులతో వాచిపోయి ఉంది, కానీ ఒక చోట మాత్రం చర్మం ఏ గాయం లేకుండా ప్రశాంతంగా ఉంది.

అప్పుడు శివుడు, *"నీ భార్య ఎక్కడైతే తన వాత్సల్యంతో గాలి ఊదిందో, ఆ ఒక్క భాగం తప్ప నా శరీరమంతా విషం వల్ల కాలిపోతోంది చూశావా! ఆమె స్వచ్ఛమైన ప్రేమ ముందు నీ ఆచారాలు చిన్నవి"* అని చెప్పాడు. 

ఆ మాటలతో నాయనారుకు కళ్లు తెరుచుకున్నాయి. భగవంతుడికి కావాల్సింది కఠినమైన ఆచారాలు కాదని, నిష్కల్మషమైన భక్తి అని గ్రహించారు. ఉదయాన్నే పరుగెత్తుకుంటూ ఆలయానికి వెళ్లి, తన భార్యను క్షమాపణ కోరి, సగౌరవంగా ఇంటికి తీసుకొచ్చారు.

🔥 **జ్ఞానసంబంధర్‌తో కలిసి మోక్షం పొందిన అద్భుత ఘట్టం!**
తిరునీలనాక్క నాయనారు గొప్ప శివభక్తుడైన 'తిరుజ్ఞాన సంబంధర్' కు అత్యంత ఆప్తులు. సంబంధర్ కు నల్లూర్ పెరుమణం (ఆచాల్పురం) లో వివాహం జరుగుతున్న సమయంలో, ఈ వివాహ మహోత్సవానికి నాయనారు తన భార్యతో కలిసి హాజరయ్యారు.

పెళ్లి జరుగుతున్న సమయంలో అందరూ చూస్తుండగానే సాక్షాత్తు ఆ పరమశివుడి అనుగ్రహంతో ఒక అఖండమైన దివ్య జ్యోతి (శివ అగ్ని) ఉద్భవించింది! ఆ దివ్య తేజస్సులోకి ప్రవేశించి శివసాయుజ్యం పొందాలని జ్ఞానసంబంధర్ అక్కడున్న భక్తకోటిని ఆహ్వానించారు. ఏమాత్రం వెనుకాడకుండా, పారవశ్యంతో ఉప్పొంగిపోయిన తిరునీలనాక్క నాయనారు తన భార్యతో కలిసి ఆ దివ్యమైన శివజ్యోతిలో ప్రవేశించారు. జ్ఞానసంబంధర్‌తో పాటు ఆయన కూడా ఆ జ్యోతిలో లీనమైపోయి శాశ్వతమైన శివసాయుజ్యాన్ని (మోక్షాన్ని) పొందారు.

నిజమైన భక్తి ఎప్పటికీ వృధా పోదు అనడానికి ఈ ఘట్టమే నిదర్శనం!
ఓం నమః శివాయ


Comments